Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ధర్నాల పేరుతో చంద్రబాబు కొత్త నాటకం

వల్లభనేని వంశీ
ధర్నాల పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ధర్నాలు చేయాలంటూ చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపుతున్నారు. ఆయన కొంగ జపాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా బద్వేల్‌లో డిపాజిట్‌ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము.. ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ు. పెట్రోలు, డీజీల్‌ ధరలను కేంద్ర ప్రభుత్వమే పెంచింది. సెస్‌ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img