Friday, March 31, 2023
Friday, March 31, 2023

నేడు ముచ్చింతల్‌కు రానున్న సీఎం జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌ వెళ్లనున్నారు. శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌ లో నిర్వహిస్తున్న శ్రీ రామానుజులు సహస్రాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ మధ్యాహ్నం 3.50 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన హైదరాబాదుకు బయల్దేరుతారు.సాయంత్రం 4.30 గంటలకు ఆయన శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ముచ్చింతల్‌ లోని త్రిదండి చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమానికి వెళ్లి సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం రాత్రి 8 గంటలకు తిరిగి తాడేపల్లికి బయల్దేరుతారు. రాత్రి 9.05 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img