Friday, September 30, 2022
Friday, September 30, 2022

పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉంది


పవన్‌ కల్యాణ్‌
పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉందని, ప్రజలకు ఉన్న హక్కును ఎవరూ ఆపలేరని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు. అనంతరం బాలాజీపేటలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాజకీయ సాధికారత కోసం పోరాటం చేస్తున్నా..ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా ఉండాలని వచ్చానని పవన్‌ అన్నారు. శ్రమదానం నాకు సరదా కాదు అని అన్నారు. రాజకీయ పార్టీ నడపటం అంత సులువుకాదు. రాజకీయమనేది కష్టమైన ప్రక్రియ అని అన్నారు. మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వం ఖజానాకు వెళుతున్నాయి. ప్రభుత్వం వద్ద డబ్బులున్నాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం. యాక్షన్‌, కెమెరా, కట్‌ అని వెళ్లే వ్యక్తిని కాదని అన్నారు. ఇంతకాలం మానసిక అత్యాచారాలు భరించాను. ఎన్నో మాటలు పడ్డా.నా సహనాన్ని తెలికగా తీసుకోకండి అని అన్నారు. కాగా ఇవాళ ఉదయం నుంచే తూర్పుగోదావరి జిల్లాలో పలువురు జనసేన నేతలను ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మరోవైపు పవన్‌ రాజమహేంద్రి ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, నేతలు రాగా వారిని సైతం అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు.. పవన్‌ ఫ్యాన్స్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img