Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

పవన్‌ కల్యాణ్‌ హత్యకు రూ.250 కోట్లతో స్కెచ్‌ వేశారు: బొండా ఉమ

ప్రతి శుక్రవారం, శనివారం జేసీబీలకు జగన్‌ రెడ్డి పని కల్పిస్తున్నారని టీడీపీ సీనియర్‌ నేత బొండా ఉమ అన్నారు. ప్రతిపక్ష నేతలు, పార్టీ అధ్యక్షుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ హత్యకు రూ.250 కోట్లతో స్కెచ్‌ వేశారని ఆరోపణలు చేశారు. రెక్కీ కూడా చేశారని వెల్లడిరచారు. ఇందులో తాడేపల్లి హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. ప్రాణాలు తీయాలనే నందిగామ పర్యటనలో చంద్రబాబు గారి కాన్వాయ్‌ పై రాళ్ల దాడి చేశారని బొండా ఉమ వ్యాఖ్యానించారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అంటూ ప్రశ్నించారు. ‘‘నందిగామ పర్యటనలో చంద్రబాబు గారి కాన్వాయ్‌ పై స్థానిక ఎమ్మెల్యే, వారి తమ్ముడు ఎమ్మెల్సీ అరుణ్‌, వారి ముఖ్య అనుచరులు కుట్రపన్ని దాడికి పాల్పడ్డారు. అదృష్టవశాత్తు ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఆ రాయి సీఎస్‌ వోకు గడ్డంపై తగిలింది. అదే కంటిపై తగిలుంటే కన్నుపోయేది. ఇంకా 15 రాళ్ల వరకు విసిరారు. ఈ ప్రభుత్వం పథకం ప్రకారం ప్రతిపక్ష నేతలపై, పార్టీల అధ్యక్షులపై పథకం ప్రకారం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. పిచ్చోడి చేతిలో రాయిలా జగన్‌ రెడ్డి పాలన ఉంది. విశాఖలో 40 వేల కోట్ల భూములను కబ్జా చేశారని ప్రశ్నించినందుకు అయ్యన్నపాత్రుడిని సీబీసీఐడీ పోలీసులు దండుపాళ్యం బ్యాచ్‌ లా వెళ్లి, గోడలు దూకి, ఆడవారిపై దౌర్జన్యం చేసి, కుమారుడు రాజేష్‌ ను కొట్టి అర్థరాత్రి అరెస్ట్‌ చేశారు. బాత్రూం అంత గోడకట్టారని అయ్యన్నపాత్రుడిని అరెస్ట్‌ చేస్తే కోర్టులు ఏం తీర్పులు ఇచ్చాయో చూశాం. జగన్‌ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్‌ రెడ్డి కడప జిల్లా కమలాపురంలో వక్ఫ్‌ భూముల్లో సినిమా హాళ్లు కడితే చర్యలు ఉండవు. నదులు పక్కన, చెరువులు పక్కన భూములు ఆక్రమించుకుని ఇళ్లు కడితే పట్టించుకోరు’’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.‘‘ఇప్పటంలో రహదారి విస్తరణ కోసం అని చెబుతున్నారు… రాష్ట్రంలో రోడ్లపై గుంతలు పూడ్చడానికి ఒక్క తట్ట మట్టి వేశారా? టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు బూజు పట్టగా… నేడు ఉన్న ఇళ్లను కూల్చుతున్నారు. ఇప్పటంలో గాంధీ, నెహ్రూ విగ్రహాలను ధ్వంసం చేసి.. వైఎస్‌ విగ్రహానికి మాత్రం పోలీసులు కాపలా ఉండి కాపాడారు. చంద్రబాబు గారిపై హత్యాయత్నంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని ముద్దాయిలుగా చేర్చి విచారణ చేయాలి. అరుణ్‌ కుమార్‌ ముఖ్య అనుచరుడే నిన్నటి పర్యటనలో ఉన్నాడు. ఎందుకు వారు అక్కడ ఉన్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు. వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పవన్‌ కల్యాణ్‌ హత్యకు రూ.250 కోట్లు సుపారీపైనా విచారణ జరగా లి అని బొండా ఉమ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img