Friday, May 31, 2024
Friday, May 31, 2024

పెండిరగ్‌ దరఖాస్తులను వెరిఫికేషన్‌ చేయాలి : సీఎం జగన్‌


నెల రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీపై కోర్టుల్లో పెండిరగ్‌ కేసులన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నానని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. తాజాగా సీఎం జగన్‌ స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పెండిరగ్‌ దరఖాస్తులను వెరిఫికేషన్‌ చేయాలని, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకంలో రిజిస్ట్రేషన్‌ పట్టాలిచ్చే కార్యక్రమం డిసెంబర్‌లోగా చేయాలని అన్నారు. లబ్ధిదారులకు లే అవుట్ల వారీగా వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు రూ.35 వేలు పావలా వడ్డీకే బ్యాంకర్లు రుణాలు ఇచ్చేలా చూడాలని పేర్కొన్నారు. వారానికొకసారి ఇళ్ల నిర్మాణంపై కలెక్టర్లు సమీక్ష చేయాలని ఆదేశించారు. విజయదశమి రోజున ‘ఆసరా పథకం’ అమలు చేస్తున్నట్లు చెప్పారు. అక్టోబరు 7 నుంచి 10 రోజలుపాటు ‘ఆసరా పథకం’పై అవగాహన, చైతన్య కార్యక్రమాలు ఉంటాయన్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమం (క్లాప్‌) అక్టోబరు 1న ప్రారంభమవుతుందని చెప్పారు. ఇక అక్టోబరు 19న ‘జగనన్న తోడు’ కార్యక్రమం ఉంటుందని సీఎం చెప్పారు.డిసెంబర్‌ 31 నాటికల్లా 4,530 పంచాయతీల్లో ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులోకి వస్తోందని తెలిపారు.వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు కూడా వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలని చెబుతామని సీఎం జగన్‌ అన్నారు. డిసెంబర్‌ నుంచి తాను కూడా సచివాలయాలను సందర్శిస్తూ ప్రతి పర్యటనలో సచివాలయాలను చూస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img