Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

ప్రివిలేజ్‌ కమిటీ ముందుకు అచ్చెన్నాయుడు

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశమైంది.ఈ సమావేశానికి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ. అచ్చెన్నాయుడిపై వచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్‌ కమిటీ విచారణ జరిపింది.దీనికి సంబంధించి గత నెలలో జరిగిన ప్రివిలేజ్‌ కమిటీ సమావేశానికి ఆయన హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలవల్ల హాజరుకాలేకపోతున్నానని అప్పుడు కమిటీకి లేఖ రాశారు. దీంతో మంగళవారం మరోసారి కమిటీ సమావేశమయింది. ఈ భేటీకి అచ్చెన్నాయుడు తప్పకుండా హాజరు కావాలని కమిటీ చెప్పడంతో ఆయన హాజరయ్యారు. సమావేశం అనంతరం ప్రివిలైజ్‌ కమిటీ చైర్మన్‌ కాకాని గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని.. ఆయన వివరణను కమిటీ సభ్యులకు పంపిస్తామని తెలిపారు. కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img