Friday, April 26, 2024
Friday, April 26, 2024

సినిమా టికెట్ల వివాదాన్ని త్వరలో పరిష్కరిస్తాం : పేర్ని నాని

సినిమా టికెట్లను పారదర్శకంగా ప్రజలకు అందిస్తామని మంత్రి పేర్ని నాని అన్నారు. నిబంధనలకు లోబడే షోలు జరగాలన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వం టిక్కెట్ల వ్యాపారం చేస్తుందని ప్రతిపక్షం నోటికొచ్చినట్లు మాట్లాడుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకం జరగాలన్నారు. ప్రజలకు మంచి చెయ్యడం కోసమే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందన్నారు.సినిమా టికెట్ల వివాదాన్ని త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img