Monday, December 5, 2022
Monday, December 5, 2022

ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్ల ఆధారంగా టెన్త్‌ ఫలితాలు

పదో తరగతి ఫలితాల కోసం హైపవర్‌ కమిటీ సమర్పించిన నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కరోనా కారణంగా పరీక్షలు రద్దు కావడంతో.. ఫలితాల వెల్లడికి అనువైన విధానంపై రాష్ట్ర ప్రభుత్వం హైపవర్‌ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. హైపవర్‌ కమిటీ సిఫార్సుల మేరకు 2019-20 విద్యా సంవత్సరానికి గ్రేడ్లు ప్రకటించి, 2020లో పాస్‌ సర్టిఫికెట్లు ఇచ్చి వారందరికీ గ్రేడ్‌ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అంతర్గతంగా 50 మార్కుల చొప్పున నిర్వహించిన.. 3 ఫార్మెటివ్‌ అసిస్మెంట్ల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు పాస్‌గ్రేడ్‌ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. వీటికి ఆమోదం తెలుపుతూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఇవాళ ఉత్తర్వులు జారీచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img