సీఎం జగన్
స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యంపై దృష్టిపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆరోగ్య శాఖపై సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్`19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్ హబ్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. స్వచ్ఛ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యంపై దృష్టిపెట్టామని, స్వేచ్ఛ ద్వారా బాలికల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నామని.. నెలకు ఒక్కసారి ఈ రకమైన కార్యక్రమం చేపట్టాలన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని పీహెచ్‌సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు కొత్త మెడికల్ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండిరగ్‌లో ఉంటే.. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.హల్త్‌కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ కూడా క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండాలని సీఎం జగన్ తెలిపారు.