Friday, December 2, 2022
Friday, December 2, 2022

బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తీర్పు వాయిదా


అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఆగస్టు 25కు వాయిదా వేసింది. కేసుకు సంబంధించి ఇవాళ సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. కోర్టు విచక్షణ అధికారాలకే నిర్ణయం వదిలేసామంటూ దాఖలు చేసిన మెమోను పరిగణలోకి తీసుకోవాలంటూ సీబీఐ న్యాయవాది కోర్టును కోరారు. కాగా ఇప్పటికే జగన్‌ తరపు న్యాయవాదులు, పిటిషనర్‌ రఘురామకృష్ణం రాజు లాయర్లు లిఖితపూర్వకమైన వాదనలు కోర్టుకు సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈ కేసులో విచారణ ముగిసిందని, ఆగస్టు 25న తుదితీర్పు వెల్లడిస్తామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img