Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

బ్యాక్‌ వాటర్‌ వస్తే తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులు తీసేస్తారా? : గుడివాడ అమర్నాథ్‌

గోదావరి వరదల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్త రచ్చకు కారణంగా మారింది. వరదలతో ఇప్పటికే భద్రాచలం, పోలవరం విలీన మండలాలు ముంపుకు గురైన నేపథ్యంలో, ముంపు మండలాలను తమకు తిరిగి ఇచ్చి వేయాలని పువ్వాడ అజయ్‌ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య కొత్త రగడకు కారణంగా మారింది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రులు ఒక్కొక్కరుగా తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చట్ట ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. అయినా బ్యాక్‌ వాటర్స్‌ వల్ల ఇబ్బందులు సహజమని ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా బ్యాక్‌ వాటర్‌ వస్తుందని గుడివాడ అమర్నాథ్‌ పేర్కొన్నారు. బ్యాక్‌ వాటర్‌ వస్తుంది అని తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులు తీసేస్తారా అంటూ గుడివాడ అమర్నాథ్‌ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img