Friday, February 3, 2023
Friday, February 3, 2023

మరోసారి క్లారిటీ ఇచ్చిన గంటా శ్రీనివాసరావు..

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారనే ప్రచారంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్‌ రెండవ వారంలోనే ఆయన పార్టీ మారుతారని.. దానికి ముహూర్తం కూడా ఖరారు అయిందని ప్రచారం జరిగింది. కానీ రెండవ వారం దాటినా ఆయన పార్టీ మారలేదు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారా ? లేదా ? అనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ వార్తలపై ఆయన స్వయంగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రచారంలో అసలు వాస్తవమే లేదు. అలాంటి సమాచారం ఏదైనా ఉంటే తప్పకుండా నేనే చెప్తా. అసలు నాకు తెలియకుండానే డేటు.. టైం కూడా ఫిక్స్‌ చేస్తారా? ఏం ప్రచారం చేసుకున్న నాకు సంబంధం లేదని గంటా శ్రీనివాసరావు అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img