Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఉత్సాహంగా ఎద్దుల బండి లాగుడు పోటీలు

విశాలాంధ్ర – బొమ్మనహళ్‌ : మండలంలోని దర్గా హోన్నూరు గ్రామంలో వన్నూరు స్వామి దేవుడి సవారి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉత్సాహంగా ఎద్దుల బండి లాగుడు పోటీలు నిర్వహించారు ఈ పోటీ లకు ఇరవై జతలు ఎద్దుల బండి లాగుడు పోటీ లో పాల్గొన్నాయి ఈ పోటీలు పాల్తూరు రవి ఎద్దుల బండి లు మొదటి బహుమతి గెలుచుకున్నాయి లింగాయత్‌ మల్లికార్జున ఎద్దుల బండి రెండో బహుమతి గెలుచుకోగా గౌరమ్మ గారి వన్నూరు స్వామి ఎద్దుల బండి మూడో బహుమతి గెలుచుకుంది నక్కయప్ప గారి వన్నూరు స్వామి ఎద్దుల బండి నాలుగో బహుమతి గెలుచుకుంది మొదటి బహుమతి దాత వైస్‌ ఎంపీపీ నాగరత్నమ్మ కుమారుడు మనోహర్‌ శెట్టి 12,000 అందజేశారు రెండో బహుమతి దాత గ్రామ సర్పంచ్‌ శకుంతలమ్మ రామాంజనేయులు పదివేల రూపాయలు మూడో బహుమతి దాత ఎంపీటీసీ శ్రీదేవి రామకృష్ణ 8000 రూపాయలు నాలుగవ బహుమతి దాత గ్రామ వైస్‌ సర్పంచ్‌ కే నాగరాజు 5000 రూపాయలు గెలుపొందిన వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు గోపాల్‌ జలంధర్‌ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img