Friday, December 9, 2022
Friday, December 9, 2022

మరో రెండు రోజులు భారీ వర్షాలు

రాబోయే రెండు రోజుల పాటు (బుధవారం, గురువారం) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు ప్రదేశాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వెల్లడిరచాయి.మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రా,దక్షిణ ఒడిస్సా తీరంల దగ్గర కొనసాగిన అల్పపీడనం ఈ రోజు బలహీన పడిరది. అనుబంధంగా ఉన్న ద్రోణి దక్షిణ ఒడిస్సా నుంచి ఉత్తర కోస్తా ఆంద్రా మీద కొనసాగుతూ మధ్యస్థ ట్రోపోస్పీయర్‌ స్థాయి వరకు వ్యాపించి నైరుతి వైపు కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img