Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

మూడొందల కాయలతో అలరిస్తున్న కమలా మొక్క

       ఆకులు కూడా కనిపించకుండా కాయలతో నిండు ఉన్న ఈ కమలా మొక్కలు కడియం నర్సరీలో సందడి చేస్తున్నాయి. విదేశాల్లోనే ఉండే ఈ మొక్కలు రెండు రోజుల క్రితం ఇక్కడకు చేరుకున్నాయి. చెట్టు పై నుంచి కింద వరకు కాయలతోనే నిండి ఉన్నాయి. రవాణా ఖర్చులు కలిపి ఇక్కడకు రావడానికి ఒక్కొక్క మొక్కకు రూ.20 వేలు ఖర్చు అయింది. అలాగని వీటిని అమ్మడానికి ప్రత్యేకంగా తీసుకొచ్చింది కాదు. ఈనెల 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం  ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో జరగాల్సిన నర్సరీ మేళాలో ప్రత్యేక ఆకర్షణంగా ఉండేందుకు ఈ నాలుగు మొక్కలను బుక్‌ చేసుకున్నారు. అయితే కోవిడ్‌ కారణంగా అధికారులు అనుమతి ఇవ్వకపొవడంతో నర్సరీ మేళా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మొక్కలు ఓడలో రావడం కూడా జాప్యం జరిగి రెండు రోజుల క్రితమే ఇక్కడకు చేరుకున్నాయి. ఈ అరుదైన మొక్కలు మన దేశానికి రావడం ఇదే ప్రథమమని తెలుస్తుంది. అయితే ఈ మొక్కలు తీసుకొచ్చిన  రైతు పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు.అదేమని అడిగితే ఈ కాయలు ఎక్కడో కాచినవని వచ్చే సీజన్‌లో తమ నర్సరీలో ఇదే విదంగా కాపు కాయించి మా నర్సరీ ప్రత్యేకతను తెలియజేస్తామని ఆ రైతు ధీమా వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img