Monday, January 30, 2023
Monday, January 30, 2023

రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన

ఈ మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.తమిళనాడు తీరానికి దగ్గరగా శ్రీలంక ప్రాంతంలో ప్రస్తుతం అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, ఈ అల్పపీడనంనకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుందని వివరించింది. రాగల 3-4 రోజులలో ఈ అల్పపీడనం పశ్చిమ దిశలో నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అల్పపీడనంనకు అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌ వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ఈరోజు బలహీనపడిరదని అధికారులు తెలిపారు. ఈ ఫలితంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉందని వెల్లడిరచింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img