Friday, March 31, 2023
Friday, March 31, 2023

విభజనపై ఇప్పటికైనా ఏపీకి సంబంధించిన నేతలు స్పందించాలి : ఉండవల్లి

ఏపీకి జరిగిన అన్యాయంపై కేసీఆర్‌ మాట్లాడాలని, బీజేపీని నిలదీసేందుకు ఏపీని కలుపుకోవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. ఏపీ విభజన నిబంధనల ప్రకారం జరిగిందని కేసీఆర్‌ ఒప్పుకుంటారా అని నిలదీశారు.ఎనిమిదేళ్ళ క్రితం లోక్‌సభలో ఏపీ విభజన బిల్లు ఆమోదం జరిగినట్టు ప్రకటించారని తెలిపారు. ఏపీ విభజనలో ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రదాని మోదీ, అమిత్‌ షాలు పార్లమెంట్‌ ఉభయ సభల్లోనే చెప్పారన్నారు. 2013లోనే విభజనపై సుప్రీంకోర్టులో ఫిటీషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. మళ్ళీ సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది అల్లంకి రమేష్‌ ద్వారా అర్జెంట్‌ పిటీషన్‌ దాఖలు చేశానన్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అపిడవిట్‌ దాఖలు చేయాలని కోరారు. విభజనపై ఇప్పటికైనా ఏపీకి సంబంధించిన నేతలు స్పందించాలన్నారు. ముఖ్యమంత్రి స్పందించి ఒక మెయిల్‌ ఏర్పాటు చేసి ఏపీ విభజనపై ప్రజల అభిప్రాయాలు సేకరించాలని సూచించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సీఎం జగన్‌ నోరుమెదపకపోవటం అన్యాయమని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img