Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విభజన హామీలు నెరవేర్చని మోడీపై తిరుగుబాటు తప్పదు

సీపీఐ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి సి.మల్లికార్జున
విశాలాంధ్ర-రాప్తాడు : ఏపీకి కేంద్రం ఇచ్చిన విభజన హామీలు ఎనిమిదేళ్లుగా నెరవేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్న మోడీపై త్వరలో తిరుగుబాటు తప్పదని సీపీఐ అనంతపురం జిల్లా కార్యదర్శి చిరుతల మల్లికార్జున హెచ్చరించారు. కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నియోజకవర్గ సహాయ కార్యదర్శి సాకే నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం అనంతపురం జిల్లా రాప్తాడులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌ లక్ష్మీనరసింహకు వినతి పత్రం అందజేశారు. మల్లికార్జున మాట్లాడుతూ 2014 విభజన నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే ప్రతిపక్ష బీజేపీ పదేళ్లు హోదా ఇస్తామని ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్లయినా వాటిపై దృష్టి సారించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది బలి దానాలతో స్థాపించిన సంస్థ, రూ.2 లక్షల కోట్లు ఆస్తులు కలిగి, లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థను నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేసేందుకు సమాయత్తమవడం సిగ్గుచేటన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హామీలు నెరవేర్చేలా చేస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్‌ రెడ్డి విశాఖకు వచ్చిన మోడీకి మోకరిల్లడం చూస్తే కేసుల నుంచి బయటపడేందుకేనని విమర్శించారు. అంబానీ, ఆదానీలకు జాతీయ సంస్థలను ధారాదత్తం చేస్తూ ప్రజా ఆదాయాన్ని తాకట్టుపెడుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  నరేంద్ర మోడీ అమరావతి రాజధానికి పిడికడు మట్టి, చెంబు నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజధాని అమరావతి, ఏపీకి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు వంటి అంశాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, అభివృద్ధిపై అలసత్వం వహిస్తుండడం అనైతికమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి, బీజేపీకి తగిన బుద్ది చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు  ఎం.చలపతి, మౌలాలి, బాషా, నబీరసూల్‌, సంజీవులు, హరీష్‌, పాపమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img