Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

వ్యక్తిగతంగా చర్చలు కరెక్ట్‌ కాదు : నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయని.. టికెట్‌ రేట్లు విషయం చాలా చిన్నదని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినిమా పరిధి పెరిగింది.. ఇంతకు ముందు టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్మాం.. ట్యాక్సులు కట్టలేదు. ఇప్పుడు రేట్లు తగ్గించారు.. రెవిన్యూ రావడం లేదన్నారు. అందుకే ఇప్పుడు ట్యాక్స్‌ కడతామని అంటున్నామన్నారు. రీజనబుల్‌ రేట్లు ఫిక్స్‌ చేయమంటున్నామన్నారు.ు. చిత్ర నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయాయని.. వాటిని నియంత్రించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు మాట్లాడినా పరిశ్రమ మొత్తం కోసం మాట్లాడాలని గుర్తు చేశారు. ప్రభుత్వం కూడా గుర్తింపు ఉన్న సంస్థలతో చర్చలు జరపాలని సూచించారు. వ్యక్తిగతంగా చర్చలు కరెక్ట్‌ కాదని.. చిరంజీవితో చర్చలు చేయండి.. ఛాంబర్‌ ప్రతినిధులను కూడా పిలవండి తమ్మారెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img