Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద

ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం 3,05,990 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో అధికారులు వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. 3.77 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా 883.90 అడుగుల మేర నీరున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా 209.5948 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వివరించారు. కుడి, ఎడమ గట్లలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img