Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

సీఎం జగన్‌కు లేఖ రాసిన కైకాల సత్యనారాయణ

తీవ్ర అనారోగ్యంతో అపోలో హాస్పిటల్‌ లో చేరిన టాలీవుడ్‌ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడిరది. పూర్తిగా కోలుకున్న ఆయన.. తన అనారోగ్య సమయంలో సహాయం అందించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు కైకాల సత్యనారాయణ నేడు లేఖ రాశారు. తన అనారోగ్య సమయంలో సహాయం అందించి ప్రత్యేక శ్రద్ద చూపించడం సంతోషమేసిందని ఆయన పేర్కొన్నారు. . ఆ కష్ట సమయాల్లో మీ సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చింది. మీరు చూపిన ఈ శ్రద్ధ మీకు కళాకారుల పట్ల మరియు వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసింది. ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుంది’ అని కైకాల లేఖలో పేర్కొన్నారు. అంతే కాక తనకు బాగోనప్పుడు తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. అలాగే అభిమానుల ప్రార్థనలే తనని మళ్ళీ మాములు మనిషిని చేశాయని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img