Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

ఉద్యోగులకు కనీసం 27 శాతం ఫిట్మెంట్‌ ఇవ్వాలని సీపీఐ నేత రామకృష్ణ సీఎం జగన్‌ను కోరారు. ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. గత 10 పీఆర్సీలలో ఇంటీరియం రిలీఫ్‌ కన్నా ఫిట్మెంట్‌ తక్కువగా ఇవ్వలేదని పేర్కొన్నారు. పీఆర్సీపై ప్రభుత్వ ప్రకటన ఉద్యోగులను నిరాశకు గురిచేసిందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు 2021 అక్టోబర్‌ నాటికే రెండేళ్లు పూర్తైందని, తక్షణమే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ ఖరారు చేసి.. పే స్కేల్‌ను అమలు చేయాలని లేఖలో రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img