Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆరుగురి సజీవదహనం

గుంటూరు జిల్లాలో ఘోర విషాదం
ప్రమాదంపై భిన్న వాదనలు

గుంటూరు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఆరుగురు మృతిచెందారు. రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో ఓ రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఆరుగురు సజీవదహనమయ్యారు. విద్యుదాఘాతంతో వారు మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు. రొయ్యల చెరువు వద్ద రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రేపల్లె : గుంటూరు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఆరుగురు మృతిచెందారు. రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో ఓ రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఆరుగురు సజీవదహనమయ్యారు. విద్యుదాఘాతంతో వారు మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు. రొయ్యల చెరువు వద్ద రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను ఒడిశా వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణం కాదని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. బ్రతుకుదెరువులో భాగంగా రొయ్యల చెరువుల వద్ద కాపలా కోసం ఒడిశా నుంచి వారు ఇక్కడికి వలస వచ్చారు. గుంటూరు జిల్లా రేపల్ల్లె మండలం లంకెవానిదిబ్బలో శుక్రవారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలాన్ని జిల్లా రూరల్‌ ఎస్‌పీ విశాల్‌గున్ని సందర్శించారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ నిపుణులు, క్లూస్‌ టీమ్‌, పోలీసు యంత్రాంగం, మెడికల్‌ సిబ్బంది ఘటనా స్థలంలో అణువణువూ పరిశీలించారు. రూరల్‌ ఎస్‌పీ విశాల్‌ గున్ని కథనం ప్రకారం ఒడిశాలోని రాయగడ్‌ జిల్లాకు చెందిన వలస కూలీలు జీవనోపాధి కోసం రొయ్యల చెరువుల వద్ద పనిచేసేందుకు వచ్చారు. కూలీలు 24 గంటలను మూడు షిప్టులుగా చేసుకుని పనిచేస్తుంటారు. కూలీల నివాసం కోసం చెరువుల యజమానులు మందులు, బ్లీచింగ్‌ పౌడర్‌ల నిల్వ కోసం షెడ్డులు నిర్మిస్తుంటారు. గురువారం పగలు పనిచేసిన కూలీలు 10 మంది రాత్రి 9 గంటలకు నిద్రించారు. దోమలు అధికంగా ఉన్న కారణంగా ఆ షెడ్డులో దోమల నిర్మూలనకు ఉపయోగించే కాయిల్స్‌ను వెలిగించారు. ప్రమాదవశాత్తు ఆ కాయిల్స్‌ బ్లీచింగ్‌ బస్తాలకు అంటుకొని మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా షెడ్డును చుట్టుము ట్టాయి. తలుపు పక్కన నిద్రిస్తున్న నలుగురు మంటల నుండి తప్పుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. మిగిలిన ఆరుగురు రామ్మూర్తి, కిరణ్‌, మనోజ్‌, పండబో, మహేం దర్‌, నవీన్‌ సజీవదహనమయ్యారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను బాపట్ల డీఎస్‌పీకి అప్పగించినట్లు ఎస్‌పీ గున్ని తెలిపారు. విద్యుత్‌ షార్టు సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగాయనే వాదన వెల్ల్లువెత్తటంతో ఆ దిశగా విచారణ చేస్తున్నామన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశామన్నారు.
భిన్నవాదనలు
వలస కూలీల సజీవదహనం కేసు అనేక అనుమానా లకు తావిస్తున్నదని ప్రజలు చెబుతున్నారు. లంకెవానిది బ్బలో బెయిలీ అనే రొయ్యల చెరువుల యజమాని తీరంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని వందకు పైగా ఎకరాలలో రొయ్యలు సాగు చేస్తున్నాడు. చెరువుల వద్ద కాపలా కోసం ఒడిశా నుంచి కూలీలను తెచ్చుకున్నాడు. చెరువులకు అవసరమైన మందులు, బ్లీచింగ్‌ నిల్వ ఉంచుకునేందుకు, కూలీల నివాసం కోసం చెరువు సమీపంలో షెడ్డులు వేసి వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. ఈ అగ్ని ప్రమాదంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మొదటగా విద్యుత్‌ షార్టు సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందన్న వార్త దావానలంగా వ్యాపించింది. ఈ విషయాన్ని పరిశీలించిన విద్యుత్‌ శాఖ ఏడీఈ…ఇది విద్యుత్‌ వైర్లు తెగిపడటం వలన జరిగిన ప్రమాదం కాదని చెప్పారు. దోమల నివారణకు ఉపయోగించే కాయిల్స్‌ కారణంగా షెడ్డులో మంటలు చెలరేగి చనిపోయినట్లు మరో వాదన వినిపిస్తోంది. సాధారణంగా బ్లీచింగ్‌ బస్తాలు ఉన్న షెడ్డులో కూలీలు ఎలా ఉంటారనే సందేహం కలుగుతోంది. రొయ్యల చెరువుల యజమాని బెయిలయ్యను, అక్కడ ఉన్న మేనేజరును అదుపులోనికి తీసుకున్నట్టు ఎస్‌పీ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img