Friday, April 26, 2024
Friday, April 26, 2024

కులగణన డిమాండ్‌కు మద్దతు తెలుపుతున్నాం

వెనకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరం : జగన్‌

కులాలవారీగా బీసీ జనగణన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. మంత్రి వేణుగోపాల్‌ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ కులాల వారీగా బీసీ జనగణన అంశంపై మంగళవారం ప్రసంగించారు. దేశంలో బీసీల జనాభా 52 శాతమని పేర్కొన్నారు. వెనకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని స్పష్టం చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కులగణన జరగలేదని తెలిపారు. కేంద్రానికి అనేక ప్రతిపాదనలు పంపామని గుర్తుచేశారు. కులగణన డిమాండ్‌కు తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పారు.బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని సీఎం జగన్‌ తెలిపారు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తెస్తున్నామని, ఈ రెండున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. బీసీ కులగణన జరిగితే మరింత వెసులుబాటు కలుగుతుందని అన్నారు. కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేస్తున్నట్లు తెలిపారు.టీడీపీ హయాంలో ఓట్ల వారీగా కులాలను విభజించారని అన్నారు. టీడీపీ పాలనలో రాజ్యసభకు ఒక్క బీసీని కూడా పంపిచలేదని సీఎం జగన్‌ అన్నారు. బీసీలను సామాజికంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని సీఎం చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img