Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

చట్టసభలకు దివ్యాంగులను పంపే బాధ్యత తీసుకుంటా : చంద్రబాబు

చట్టసభలకు దివ్యాంగులను పంపే బాధ్యత తాను తీసుకుంటానని, రిజర్వేషన్‌లు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తానని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.. శుక్రవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ‘ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి దివ్యాంగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దివ్యాంగుడైన కోటేశ్వరరావు ఎన్టీఆర్‌కు, తనకు పైలట్‌గా ఉండేవారని చెప్పుకొచ్చారు. విభిన్న ‘ప్రతిభావంతులకు రూ.500 ఉండే పెన్షన్‌..3 వేలు చేశాం. ఎప్పుడో ఎన్టీఆర్‌ కట్టిన ఇంటికి ఇప్పుడు జగన్‌ పట్టా ఇస్తాను అంటున్నాడు. డ్వాక్రా మహిళపై వేధింపులు మొదలు పెట్టారు. రాజ్యాంగం ఇంకా బతికే ఉంది.. తప్పును ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత కమిషన్‌ వేయడం ఖాయం.. ఇప్పుడు తప్పు చేసిన వారిపై అప్పుడు చర్యలు తప్పవు. రాక్షస జాతిలా ఈ ప్రభుత్వం ప్రజలను పీల్చుకుతింటోంది.’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img