Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నెరవేరిన నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం.. సీఎం జగన్‌

నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రారంభించిన సీఎం జగన్‌ అనంతరం మాట్లాడుతూ, సంగం బ్యారేజీతో మొత్తంగా 3.85లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుందన్నారు. రూ.200కోట్లతో సంగం ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం సంగం బ్యారేజీకి రూ.30కోట్ల 80లక్షలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. నెల్లూరుకు వైఎస్‌ఆర్‌ మంచి చేస్తే..దాన్ని తాను కొనసాగించానన్నారు. 26 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో తీసుకున్నామన్నారు.‘’సంగం ప్రాజెక్ట్‌ను ప్రాధాన్యత ప్రాజెక్ట్‌గా వేగం పెంచాం, పూర్తి చేశాం. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమారుడిగా ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసినందుకు గర్వ పడుతున్నా. నాన్నగారి హయాంలో ప్రారంభిస్తే, ఆయన మరణం తర్వాత నిర్లక్ష్యం చేశారు. గత ప్రభుత్వం సంగం బ్యారేజి కోసం రూ.30 కోట్ల 5 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. బాబు హయాంలో కమీషన్లు దండు కోవడమే వాళ్లు చేశారు. సంగం ప్రాజెక్టుకు మన ప్రభుత్వంలో రూ.200 కోట్లు ఖర్చు చేశాం. కోవిడ్‌ సమస్య, వరద సమస్య ఉన్న మూడేళ్లలో పూర్తి చేశాం. స్నేహితుడు మేకపాటి గౌతం రెడ్డి పేరు పెట్టాం. హఠాన్మరణంతో గౌతమ్‌ మనకు దూరం అయ్యాడు. సంగం బ్యారేజికి మేకపాటి గౌతం రెడ్డి పేరు పెట్టాం. గౌతం సంస్మరణ సభలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. 3లక్షల 85 వేల ఎకరాలు అయకటు స్థిరీకరణ జరుగుతోంది. నెల్లూరు ప్రాజెక్ట్‌ రూ.147 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభిస్తే.. రూ.86 కోట్లు ఖర్చు చేశారు.. ఆయన మరణం తర్వాత వాటిని పట్టించు కోలేదు. జలయజ్ఞంలో పెట్టిన 26 ప్రాజెక్ట్‌లు ప్రాధాన్యత క్రమంలో తీసుకుని ప్రతి ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తాం’’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img