Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పదో తరగతిలో మళ్లీ మార్కుల విధానం

గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు రద్దు
పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకొస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందన్న ఉద్దేశంతో.. 2010లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రేడిరగ్‌ విధానానికి స్వస్తి పలికింది. మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకొస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కువ మందికి ఒకే గ్రేడ్లు వచ్చినప్పుడు.. నియామకాల సమయంలో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో గ్రేడ్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. 2019 మార్చి వరకు విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఇస్తారు. 2020 మార్చి నుంచి మార్కులు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలను నిర్వహించలేదు.ఈ ఏడాది ఇంటర్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఉన్నందున సీట్ల కేటాయింపు కష్టంగా మారింది. దీంతో ప్రభుత్వం గ్రేడిరగ్‌ వ్యవస్థనే రద్దు చేసింది. తిరిగి మార్కుల విధానాన్ని తీసుకొచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img