Friday, May 3, 2024
Friday, May 3, 2024

పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం..గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థి మృతి

తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. వరుస ఘటనలతో అందరిలో టెన్షన్‌ మొదలైంది. కళ్లముందు అప్పటి సంతోషంగా గడిపినవాళ్లు కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ గుండెపోట్లు ప్రాణాలు తీసేస్తున్నాయి. తాజాగా మరో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందిన ఫిరోజ్‌ ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. సోమవారం రాత్రి అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పాడు.. భోజనం చేసి నిద్రపోయాడు.ఫిరోజ్‌ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గుండె నొప్పిగా ఉందని చెప్పాడు. వెంటనే పక్కనున్నవారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. డాక్టర్లు కూడా గుండెనొప్పితో ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానిస్తున్నట్లు ఆ కుర్రాడి తండ్రి చెబుతున్నారు.గత నెలలో కర్నూలు జిల్లాలో కూడా ఓ యువకుడు జిమ్‌ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఆదోనికి చెందిన యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. వర్క్‌ ఫ్రం హోం కావడంతో ఇంట్లో నుంచే విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి మే నెలలో వివాహం కూడా నిశ్చయమైంది. అతడు ఎప్పటిలాగే ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మెయిన్‌ రోడ్డుపై జిమ్‌కు వెళ్లాడు.. కొద్దిసేపు వ్యాయామం చేశాక కాస్త కళ్లు తిరుగుతున్నాయని చెప్పి బయటకు రాగా.. స్నేహితుడు వాటర్‌ బాటిల్‌ తెచ్చేంందుకు వెళ్లాడు. ఇంతలో యువకుడికి మూర్ఛ వచ్చి కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే అతడికి సపర్యలు చేసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఆ యువకుడు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. హార్ట్‌ ఎటాక్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img