Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

పల్నాడు జిల్లా..టీడీపీ నేతపై కత్తులు..గొడ్డళ్లతో దాడి..

అచ్చెన్నాయుడు ఫైర్‌
పల్నాడు జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి పై హత్యాయత్నం జరిగింది. అలవల గ్రామంలో మార్నింగ్‌ వాక్‌ కు వెళ్లిన సమయంలో ప్రత్యర్థులు ఆయనపై గొడ్డళ్లతో దాడికి యత్నించారు. ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డిని చికిత్స నిమిత్తం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. గతంలో రొంపిచర్ల ఎంపీపీగా పని చేసిన వెన్న బాల కోటిరెడ్డి ప్రస్తుతం రొంపిచర్ల మండలం పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బాలకోటిరెడ్డిపై దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిరచారు. నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌ డా.చదలవాడ అరవింద బాబు నరసరావుపేట ఆసుపత్రికి వెళ్లి బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బాలకోటిరెడ్డిపై వైసీపీ రౌడీ ల దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. సీఎం జగన్‌ రెడ్డి ఫ్యాక్షన్‌ భావాల్ని నరనరనా నింపుకున్న వైసీపీ కార్యకర్తలు.. మృగాల కంటే హీనంగా ప్రవరిస్తున్నారంటూ మండిపడ్డారు. సామాన్యుల నుంచి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. చర్యకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని, ఇప్పుడు వైసీపీ చేస్తున్న పనులకు కర్మఫలం అనుభవించాల్సి ఉంటుందన్నారు.
టీడీపీ నేత బాలకొడ్డి రెడ్డి మీద దాడి చేయడం హేయమైన చర్య అని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌ చదలవాడ అరవింద్‌ బాబు అన్నారు. ఈ దాడి రొంపిచర్ల ఎంపీపీ భర్త గడ్డ వెంకట్రావు, వారి అనుచరులు చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో అలవాల గ్రామంలో టీడీపీ కార్యకర్తల మీద దాడి చేసిన సమయంలో ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, ఎమ్మెల్యే సహకారంతోనే దాడి జరిగిందని అనుమనాలు వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ వైఫల్యం వల్లనే టీడీపీ నేతల మీద రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తలకు బలమైన గాయాలు కావడంతో బాలకోటి రెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్లాడని అరవింద్‌ బాబు తెలిపారు. ఈ దాడి చేసిన వారిని, చేయించిన వారిని అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img