Friday, April 26, 2024
Friday, April 26, 2024

పోలీస్‌ త్యాగాలు వెలకట్టలేనివి : ఏపీ డిప్యూటీ సీఎం

పోలీస్‌ త్యాగాలు వెల కట్టలేనివని జిల్లా ఇన్చార్జి మంత్రి డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి అన్నారు. ఈ ఉదయం స్థానిక పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ లో జరిగిన పోలీసుల అమరవీరుల దినోత్సవంలో ముఖ్యఅతిథిగా డిప్యూటి సీఎం, అతిధులుగా జిల్లా కలెక్టర్‌ కె.వెంకరమణ రెడ్డి, జిల్లా జడ్జి వీర్రాజు, జిల్లా పార్లమెంట్‌ సభ్యులు, శాసన సభ్యులు పాల్గొని అమరవీరుల స్థూపం వద్ద పోలీసు అమర వీరులకు నివాళులర్పించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి మాట్లాడుతూ.. మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను స్మరించుకోవడం మన విధి అని, దేశం కోసం త్రుణపాయంగా పోలీసులు ప్రాణాలనర్పిస్తున్నారని, సమాజ శ్రేయస్సు కోసం శాంతియుతంగా పోరాడున్న పోలీసుల త్యాగాలను మనం గుర్తు చేసుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తుందని, విధినిర్వహణలో మరణించిన వారికి అందించే పరిహారం, కారుణ్య నియామకం అమలు చేస్తుందని, దీనికి తోడుగా హోంగార్డుల సంక్షేమం కోసం ప్రమాదాల్లో మరణించిన వారికి రూ.10లక్షలు, సర్వీస్‌ లో ఉన్న హోంగార్డులు సహజంగా మరణించినా రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రభుత్వం అందిస్తూ అండగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img