Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మహేశ్‌ బాబు ఇంటిలో చోరీకి యత్నించిన దుండగుడు-గాయాలతో ఉస్మానియాలో చికిత్స

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 81 లో నివాసం ఉంటున్నారు. ఓ నిందితుడు మహేష్‌ బాబు ఇంటి ప్రహరీ గోడ దూకాడు. ఈ క్రమంలోనే పెద్ద శబ్దం రావడంతో మహేష్‌ ఇంటి సెక్యూరిటీ గార్డులు అప్రమత్తమయ్యారు. శబ్దం వచ్చిన వైపు వెళ్లిచూడగా.. ఓ వ్యక్తి గాయపడి కనిపించాడు. దీంతో వారు వెంటనే అతడిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణలో అతడి పేరు కృష్ణ అని గుర్తించారు. ఒడిశా నుంచి మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన అతడు.. మహేష్‌ ఇంటికి సమీపంలోని ఓ నర్సరీలో ఉన్నాడని విచారణలో తేలింది. మహేష్‌ నివాసంలో చోరికి యత్నించే సమయంలో 30 అడుగుల ఎత్తైన గోడపై నుంచి దూకడంతో అతడు గాయపడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి సెక్యూరిటీ గార్డు ఫిర్యాదుతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img