Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రోడ్ల గురించి కేటీఆర్‌ చెప్పిన దానిలో అవాస్తవాలు ఏమున్నాయి ? : రామకృష్ణ

రోడ్ల గురించి కేటీఆర్‌ చెప్పిన దానిలో అవాస్తవాలు ఏమున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా మంత్రులు సిగ్గులేకుండా మూకుమ్మడిగా సమాధానం చెప్తున్నారు.తాము చెప్తే వినలేదు, పక్క రాష్ట్రం మంత్రి చెప్తే మొత్తం మంత్రులు అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. ‘మరో పక్క విద్యుత్‌ చార్జీలు, కోతలు, ఆర్టీసీ ఛార్జీలతో హింస పెడుతున్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు 64 రూపాయలు ఉండే పెట్రోల్‌ ఇవాళ 122 రూపాయలు అయింది.పెట్రోల్‌ పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే 10 రూపాయలు రాష్ట్రంలో అధికంగా ఉంది.’ అని అన్నారు. .ప్రతి ఒక్క వస్తువు ధర రాష్ట్రంలో విపరీతంగా పెంచారు. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తా అని చెప్పి 7 సార్లు చార్జీలు పెంచారు.అదానికి అమ్ముడు పోయారు , అదానికి ఇచ్చే కమిషన్లకు అమ్ముడుపోయారు.ధరల పెంపు ,నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరసనగా రాష్ట్ర సచివాలయం వద్ద మే 9వ తేదీన నిరసన చేపడతామని రామకృష్ణ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img