Friday, April 26, 2024
Friday, April 26, 2024

విజయవాడ బాధితురాలకి రూ.5లక్షలు పరిహారం ప్రకటించిన చంద్రబాబు

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జగన్‌ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. బాధితురాలికి టీడీపీ తరపున రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. బాధితురాలికి న్యాయం జరగాలని… నిందితులకు తక్షణం శిక్ష పడాలని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ‘ఇది చాలా దుర్మార్గపు ఘటన. ఆస్పత్రికి తీసుకొచ్చి బంధిస్తారా? రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైంది. ఆసుపత్రిలో యువతిపై అత్యాచారం ఏపీకే అవమానం. 30 గంటలపాటు యువతిని బంధించారు. ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా? అని సీఎంను ప్రశ్నిస్తున్నా. సీఎం ఒంగోలుకు కాదు వెళ్లాల్లింది. ఇక్కడికి రావాలి. మోసపూరిత సున్నా వడ్డీ కోసం సీఎం ప్రకాశం జిల్లా వెళ్లారు. ఆడబిడ్డల విలువ ఈ ప్రభుత్వానికి తెలియదు. ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదుని అన్నారు. ఈ సంఘటనలో నిర్లక్ష్యం వహించన పోలీసులపై, ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత అన్నారు. మరోవైపు విజయవాడ ఆస్పత్రి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకునే ముందు మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్టి పద్మ అక్కడకు చేరుకున్నారు. చంద్రబాబు వచ్చినా అక్కడి నుండి వాసిరెడ్డి పద్మ అక్కడి నుంచి బయటకు రాకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు ఆస్పత్రికి వచ్చిన వాసిరెడ్డి పద్మను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను పక్కకు లాగిన పోలీసులు.. అతి కష్టం మీద వాసిరెడ్డి పద్మను ఆసుపత్రి లోపలకి పంపించారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img