Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

షాపింగ్‌ నుంచి వస్తున్న జంటకు ఆకతాయిల వేధింపులు.. రోడ్డుపైనే నీచంగా!

విశాఖలో దారుణమైన ఘటన జరిగింది. షాపింగ్‌ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి నడిచి వెళ్తున్న ఒక కుటుంబాన్ని ఆకతాయిలు వేధించారు. వివాహిత పట్ల నీచంగా ప్రవర్తించారు. ఓ వ్యక్తి భార్య, కుమార్తెతో కలిసి బుధవారం రాత్రి షాపింగ్‌కు వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో.. బైక్‌పై వెళుతున్న ఇద్దరు ఆకతాయిలు మద్యం, గంజాయి మత్తులో గట్టిగా హారన్‌ మోగించారు. వాళ్లను భయపెట్టేలా చేశారు. వారి చేష్టలతో కుమార్తె భయపడి పెద్దగా కేకలు వేసింది. దీంతో దంపతులు ఆ యువకుల్ని హెచ్చరించారు. ఆ తర్వాత ఇద్దరు ఇంకా రెచ్చిపోయారు.. భార్యాభర్తలపై దాడి చేశారు.. వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమె దుస్తులను చించేశారు.. ఆమె వెంటనే తన తమ్ముడికి ఫోన్‌ చేసి జరిగినదంతా చెప్పారు. ఆ యువకుడు వెంటనే అక్కడికి వచ్చాడు.. ఇద్దరు యువకులతో వాగ్వాదానికి దిగాడు. అతడ్ని కూడా ఇద్దరు యువకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధిత కుటుంబం ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్‌ చేయించుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది. పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img