Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సంకల్ప సిద్ధి స్కాం కేసులో.. కీలక విషయాలు..

ఏపీలోని విజయవాడ సంకల్ప సిద్ధి స్కాం కేసులో కీలక విషయాలు బయట పడ్డాయి. సంస్థ మొత్తం రూ.240 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారని సమాచారం. అదేవిధంగా లక్షా 30 వేల ఐటీలతో పాటు 17 అకౌంట్ల నుంచి లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వాస్తవంగా పెట్టుబడులు పెట్టిన వారు 60వేల మందిగా గుర్తించారు. కమిషన్‌ కోసం 20 వేల మందికి పైగా డబుల్‌ ఐటీలు క్రియేట్‌ చేశారని తెలిపారు.అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. 2021 జులై 19న విజయ్‌ నాగ శేషచార్యులు అనే వ్యక్తికి రూ.5 లక్షలు ఇచ్చి వేణుగోపాల్‌ సర్వర్‌ క్రియేట్‌ చేయించారని సమాచారం. ఈ నేపథ్యంలో క్రెడిట్‌, డెబిట్స్‌ పై పోలీసులు దృష్టి సారించారు. సంస్థ చైర్మన్‌ ఫోన్‌ డేటా ఆధారంగా వారి విచారణ కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img