Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

సిట్‌పై స్టే ఎత్తివేత

. దర్యాప్తును ప్రాథమిక దశలో అడ్డుకోవడం సరికాదు
. కేసు అపరిపక్వ దశలో హైకోర్టు జోక్యం: సుప్రీం
. జగన్‌ సర్కారుకు ఊరట

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్‌’పై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. సిట్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును మెరిట్‌ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు సుప్రీం సూచించింది. హైకోర్టు ఈ కేసు అపరిపక్వస్థాయిలో జోక్యం చేసుకొని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొంది. సిట్‌ దర్యాప్తును ప్రాథమిక దశలోనే అడ్డుకోవడం సరికాదని పేర్కొంది. అందువల్లనే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తోసిపుచ్చు తున్నామని వెల్లడిరచింది. సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో సంబంధం లేకుండా మెరిట్స్‌ ప్రాతిపదికన ఈ కేసును విచారించి తుది నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు సూచించింది. జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌ ధర్మాసనం తీర్పును వెలువరించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ఆర్థిక అవతవకలు చోటుచేసుకున్నాయని, రాజధాని పేరుతో భారీ కుంభకోణం జరిగిందని వైసీపీ ప్రభుత్వం అభిప్రాయపడిరది. వీటన్నింటిపై దర్యాప్తు కోసం ‘సిట్‌’ ఏర్పాటు చేసింది. సిట్‌ ఏర్పాటును ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు సవాల్‌ చేశారు. దీంతో సిట్‌పై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్‌ చేస్తూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం స్టేను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img