Monday, March 27, 2023
Monday, March 27, 2023

20న విశాఖకు ఏపీ గవర్నర్‌

ఈ నెల 20న ఏపీ గవర్నర్‌ బిశ్వ భూషన్‌ హరిచందన్‌ విశాఖపట్నం విచ్చేయనున్నారు. ఫిబ్రవరి 21, సోమవారం జరగనున్న ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌ రివ్యూకోసం గవర్నర్‌ , రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌తో పాటు రానున్నారు. గవర్నర్‌ హరిచందన్‌ ఫిబ్రవరి 20 ఆదివారం నాడు నావల్‌ ఎయిర్‌బేస్‌, ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ను ఆహ్వానించనున్నారు. మరుసటి రోజు నేవల్‌ బేస్‌లో జరగనున్న కార్యక్రమాలలో పాల్గొంటారు. రాష్ట్రపతి కోవింద్‌ ఎన్‌14ఏ జెట్టీ నుండి రాష్ట్రపతి ఫ్లీట్‌ సమీక్షలో పాల్గొంటారు. ఆ తర్వాత ఫిబ్రవరి 22న రాష్ట్రపతి, గవర్నర్‌ నేవల్‌ డాక్‌యార్డ్‌ని సందర్శిస్తారని, అదే రోజు విజయవాడకు తిరిగి వస్తారని గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి.సిసోడియా వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img