Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆర్వో సంతకం ఉంటే పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లుబాటు: ఈసీ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) సంతకం ఉన్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు చెల్లుబాటవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడిరచింది. పోస్టల్‌ బ్యాలెట్‌పై ఆర్వో సీల్‌ లేకున్నప్పటికీ, వాటిని తిరస్కరించవద్దని మార్గదర్శకాలు జారీజేసింది. వాటిని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా పంపారు. ఫామ్‌ 13ఏపై ఆర్వో సంతకంతోపాటు అన్ని వివరాలు ఉండాలని సూచించింది. ఆర్వో సంతకంతోపాటు బ్యాలెట్‌ను ధృవీకరించే రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలని తెలిపింది. ఫామ్‌ 13ఏలో ఓటరు, ఆర్వో సంతకం, బ్యాలెట్‌ సీరియల్‌ నంబరు లేకుంటే వాటిని తిరస్కరించవచ్చని స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షలకుపైగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను వినియోగించుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండువేల నుంచి నాలుగువేల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉన్నాయి. హోరాహోరీ పోటీ ఉన్న అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపునకు వారి ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లపై అధికార వైసీపీ, ఎన్డీఏ కూటమి పార్టీలు ప్రధాన దృష్టి పెట్టాయి. ఎన్నికల ముందు నుంచే ఈ ఓట్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నించాయి. చాలా చోట్ల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల సమయంలో గందరగోళం నెలకొంది. ఓట్లేయడానికి వచ్చిన ఉద్యోగులు ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిరది. జూన్‌ నాలుగో తేదీన ముందుస్తుగా ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img