Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీపై మంత్రి బొత్స సమీక్ష

ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. రైతుల డిమాండ్‌, యాజమాన్య వైఖరిపై చర్చించారు.ఈ సందర్భంగా పోలీసులపై దాడి, పోలీస్‌ సిబ్బందికి గాయాల విషయాన్ని జిల్లా ఎస్‌పీ దీపికా మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ, రైతులకు త్వరగా న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాజమాన్యంతో చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా 2019-20 చెరుకు రైతులకు ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం 16 కోట్ల 50 లక్షలు బకాయిపడిరది. ఈ ఏడాది పరిశ్రమలో చెరుకు క్రషింగ్‌ చేయకపోవడం, రైతుల బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. అంతేగాక రైతుల పేరుతో షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి 70 కోట్లు బ్యాంకు ఋణం తీసుకుంది. దీంతో రుణాలు తీర్చమని రైతులకు బ్యాంకులు నోటీసులు ఇచ్చింది. వీటికి తోడు షుగర్‌ ఫ్యాక్టరీ.. కార్మికులకు మరో 5 కోట్ల బకాయిలు చెల్లించాలి. మొలాసిస్‌, ఫ్యాక్టరీ భూములు అమ్మి బకాయిలు తీర్చుతామని హామీ ఇచ్చి విస్మరించింది. ఈ నేపథ్యంలో షుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని రైతు సంఘం డిమాండ్‌ చేస్తోంది. వీటిపై జిల్లా కలెక్టర్‌, ఎస్‌పీలతో కలెక్టరేట్‌లో మంత్రి బొత్స సమీక్ష చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img