Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఏపీని వీడని వర్షాలు..మరో అల్పపీడనం..

ఏపీలో కురుస్తున్న వర్షాలకు రాయలసీమ, కోస్తాఆంధ్రాలోని పలు ప్రాంతాలు ఇప్పటికే నీటమునిగాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. వర్షాలు, వరదల ధాటికి చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5 .8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక -తమిళనాడు తీరం వైపునకు ప్రయాణించే అవకాశం ఉంది. మరొక ద్రోణి, నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల మీదనున్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు, సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img