Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాలో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర:రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఒకట్రెండు చోట్ల. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img