Friday, May 17, 2024
Friday, May 17, 2024

కల్తీసారా వాస్తవాలు బయటకొస్తాయని ప్రభుత్వం భయపడుతోంది : లోకేష్‌

కల్తీసారా వాస్తవాలు బయటకొస్తాయని ప్రభుత్వం భయపడుతోందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలను ఉప ముఖ్యమంత్రి తిడుతుంటే జగన్‌ నవ్వుతూ చూస్తారా? అంటూ ప్రశ్నించారు.కల్తీసారా వాస్తవాలు బయటకొస్తాయని ప్రభుత్వం భయపడుతోందని, అన్నీ బయటకొస్తాయనే తమను దూషించి.. చర్చ నుంచి పారిపోతున్నారంటూ లోకేష్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో లభ్యమయ్యే మద్యంలో రసాయనాలు ఉన్నాయనే ల్యాబ్‌ రిపోర్టులు తమ దగ్గర ఉన్నాయన్నారు. సభలో కల్తీసారా, జే బ్రాండ్‌లపై చర్చ వద్దంటే.. ఇంక దేనిపై చర్చలు జరుపుతారని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img