Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులకు నిరసన సెగ

‘గడపగడపకూ మన ప్రభుత్వం’ పేరుతో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తగిలాయి. ఇవాళ కర్నూలు జిల్లా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరాంను హత్తిబెళగల్‌లో పలు అంశాలపై ప్రజలు ఘెరావ్‌ చేశారు. ఆలూరు`హత్తిబెళగల్‌ మెయిన్‌ రోడ్డు ఎప్పుడు వేస్తారంటూ ప్రశ్నించారు. తమకు అమ్మ ఒడి ఎందుకు ఇవ్వడం లేదంటూ కొందరు మహిళలు మంత్రిని నిలదీశారు. దీంతో సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు. ఇటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కూ నిరసన తప్పలేదు. రెండు నెలలుగా ఉపాధి హామీ పనుల డబ్బులు రావడం లేదంటూ బేతంచర్ల మండలం హెచ్‌. కొట్టాలకు చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. డబ్బులు ఎందుకు పడడం లేదని అధికారిని అడిగిన మంత్రి.. వారంలో డబ్బులు పడతాయని వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్సీ ఇక్బాల్‌ పై ప్రజలు మండిపడ్డారు. సమస్యలు చెప్పినా పట్టించుకోకుండా వెళ్లిపోయారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రోడ్డు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని మొరపెట్టుకున్నా వినలేదని చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండ పరిధిలోని మద్దికెరలో డ్రైనేజీ సమస్య ఉందంటూ ఎమ్మెల్యే శ్రీదేవికి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఎన్నోరోజుల కిందటనో డ్రైనేజీ పాడైందని, అయినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img