టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరిలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఏర్పాటు చేసిన బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించివేయడంతో వివాదం రాజుకుంది. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులకు దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్ర, ఇతర టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు.జెండాలను గాల్లో తిప్పుతూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకు వైసీపీ శ్రేణులు యత్నించినట్టు టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడికి దిగింది. అంగళ్లు సెంటర్ వద్దకు ఇరువర్గాలు చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించకుండా, చోద్యం చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.