Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

వివాహ బంధంపై మోహే డిజిటల్‌ క్యాంపెయిన్‌

హైదరాబాద్‌ : భారతదేశంలో వివాహ వేడుక, కన్యాదానం వంటి మన సాంప్రదాయ ఆలోచనను హైలైట్‌ చేస్తూ, అలియాభట్‌తో ‘మోహె’ ఒక అద్భుతమైన డిజిటల్‌ వీడియో క్యాంపెయిన్‌ని రూపొందించింది. వివాహం ద్వారా యువతులు తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అంతకుముందు పుట్టింట్లో ఎలాంటి జీవితం ఉందో… అలాంటి ఆనందమయమైన జీవితాన్నే వాళ్లు కోరుకుంటారు. అది వారి హక్కు. ఈ క్యాంపెయిన్‌ ద్వారా ఆలియా భట్‌.. ఒక కొత్తఆలోచన గురించి మాట్లాడిరది. అదే కన్యామాన్‌. కన్యాదానం కాకుండా కన్యామాన్‌ ఉండాలని గట్టిగా చెప్తోంది మోహె. ఇదిఆధునిక సమాజంలో మనం ఆచరించాల్సిన ఆచార వ్యవహారాలు, అందులోని అంతర్లీనఆలోచనను మరోసారి స్పష్టంగా చెప్తోంది. ఈ డిజిటల్‌ ఫిల్మ్‌ చిన్నదే కానీ… అద్భుతమైన సందేశాన్ని అందించింది. కన్యాదానం నుంచి కన్యామాన్‌ మార్పుని ప్రధానంగా ప్రస్తావించిందని వేదాంత్‌ ఫ్యాషన్స్‌ లిమిటెడ్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ వేదాంత్‌ మోదీ అన్నారు. ఈ క్యాంపెయిన్‌లో నటించనందుకు తనకు చాలా ఆనందంగా ఉందని బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img