Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఐఎంఎ ఆధ్వర్యంలో కంటిన్యూడ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ శిక్షణ

ముంబయి: బిఎఎస్‌ఎఫ్‌ సహకారంతో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేసన్‌ (ఐఎంఎ), నేషనల్‌ పాయిజన్స్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (ఎన్పిఐసి), ఎఐఐఎంఎస్‌-న్యూఢల్లీితో కలిసి బిఎఎస్‌ఎఫ్‌, 250 మంది డాక్టర్లు, వైద్య విదార్థులకు కంటిన్యూయింగ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్పై (సిఎంఇ) ప్రత్యేకంగా వర్చువల్‌ శిక్షణ నిర్వహించింది. రోగనిర్థారణ, చికిత్స ప్రొటోకాల్స్పై రిఫ్రెషర్‌ అందించడం, యాక్సిడెంటల్‌ ఆగ్రోకెమికల్‌ పాయిజనింగ్‌ సంఘటనలను సంభాళించడంపై ఆమోదించిన ప్రొటోకాల్స్‌ ప్రకారం వైద్య సమాజానికి మద్దతు ఇవ్వడం శిక్షణ లక్ష్యం. మెడికో టాక్సికాలజీ, హ్యూమన్‌ హెల్త్‌ రిస్కు ఎసెస్మెంట్‌ అండ్‌ ఫుడ్‌ సేఫ్టీపై అంతర్జాతీయ నిపుణులు డా. డెబబ్రట కనుంగో సవివరమైన శిక్షణ నిర్వహించారు. నిర్దిష్ట కేస్‌ స్టడీస్‌ ద్వారా, వివిధ విషపూరిత పరిస్థితులను సంభాళించడంపై ప్రొటోకాల్స్‌ను, సంబంధిత చికిత్సను అతను వివరించారు. యాక్సిడెంటల్‌ ఆగ్రోకెమికల్‌ పాయిజనింగ్‌ నిర్థారణ, అదుపు చేయడం, చికిత్స సిద్ధాంతాలపై కీలక సమాచారాన్ని కూడా శిక్షణ ద్వారా అందించినట్లు ఐఎంఎ (ప్రధాన కార్యాలయం) నేషనల్‌ ప్రెసిడెంట్‌ డా. సహజానంద్‌ ప్రసాద్‌ సింగ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img