Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఐఐటీ మద్రాస్‌లో బీఎస్‌సీ డేటా సైన్స్‌

చెన్నై: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాస్‌ (ఐఐటీ మద్రాస్‌) వారి బీఎస్‌సీ ఇన్‌ ప్రోగ్రామింగ్‌, డేటా సైన్స్‌ దేశవ్యాప్తంగా విద్యార్థులు నుండి వచ్చిన తీవ్రమైన డిమాండ్‌ వలన ఇప్పుడు డేటా సైన్స్‌, అప్లికేషన్స్‌లో నాలుగు సంవత్సరాల బీఎస్‌ డిగ్రీతో అందుబాటులోకి వచ్చింది. బీఎస్‌ స్థాయిలో భాగంగా, విద్యార్థులు 8 నెలల అప్రెంటీస్‌షిప్‌ను లేదా కంపెనీస్‌ లేదా పరిశోధనా సంస్థలతో ప్రాజెక్ట్‌ను చేయవచ్చు. విద్యార్థులకు పలు ప్రవేశ, నిష్క్రమణ ఆప్షన్స్‌ని అందించడానికి ఈ విలక్షణమైన ప్రోగ్రాం జాగ్రత్తగా రూపొందింది. నేర్చుకునే వారు దీనిలో సర్టిఫికెట్‌, డిప్లొమా లేదా డిగ్రీ సంపాదించవచ్చు. ఇది నేర్చుకునే వారికి సౌలభ్యంగా ఉంటుంది. ఈ ప్రోగ్రాం ద్వారా తాము సాధించాలని కోరుకున్నది వారు ఎంచుకునే అవకాశం ఇస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img