Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

క్రికెట్‌ అభిమానులకు షేర్‌ చాట్‌ కొత్త ఫీచర్‌

హైదరాబాద్‌ : షేర్‌ చాట్‌ రాబోయే క్రికెట్‌ టోర్నమెంట్స్‌ కోసం స్కోర్‌ బోర్డ్‌ను, బాల్‌ టు బాల్‌ కామెంటరీని మిళితం చేసేలా ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఎనిమిది ప్రాంతీయ భాషల్లో దీన్ని అందించనుంది. తన ఆడియో చాట్‌ రూమ్‌ ఫీచర్‌ సాయంతో ఈ వేదిక సమగ్ర సోషల్‌ క్రికెట్‌ అనుభూతిని అందించేందుకు గాను వీరేందర్‌ సెహవాగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, గౌతమ్‌ గంభీర్‌, శిఖర్‌ ధావన్‌, అజిత్‌ అగార్కర్‌, ఆకాశ్‌ చోప్రా లాంటి కీలక ఆటగాళ్లతో చాట్‌ రూమ్‌ సెషన్స్‌ నిర్వహిస్తోంది. 180 మిలియన్లతో కూడిన పటిష్ఠమైన షేర్‌ చాట్‌ కమ్యూనిటీ ఇప్పుడు మ్యాచులు, పనితీరు, ఇతర కీలక మూమెంట్స్‌ గురించి తమ అభిమాన ఆటగాళ్లతో చర్చించే అవకాశాన్ని పొందనుంది. భారతదేశ అతిపెద్ద ఇండిక్‌ లాంగ్వేజ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌గా షేర్‌ చాట్‌ ఉన్న నేపథ్యంలో ఈ ఫీచర్లు ఎనిమిది విభిన్న భాషల్లో (తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, బంగ్లా, మరాఠీ, పంజాబీ, మలయాళం) అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img