Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తెలంగాణలో నిధుల సేకరించిన ఇంపాక్ట్‌ గురు.కామ్‌

విశాలాంధ్ర/హైదరాబాద్‌: భారతదేశంలో అగ్రగామి ఆరోగ్యసంరక్షణ క్రౌడ్‌ ఫండిరగ్‌ వేదిక ఇంపాక్ట్‌ గురు.కామ్‌ ద్వారా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన 3000పైగా రోగులు రూ.40 కోట్లకు పైగా మొత్తాన్ని విరాళాలుగా పొందారు. ఆన్‌లైన్‌ క్రౌడ్‌ ఫండిరగ్‌తో వివిధ ఫండ్‌ రైజర్‌ క్యాంపెయిన్ల ద్వారా ఈ మొత్తం సేకరించబడిరది. ఇది రోగుల వైద్యఖర్చులకే గాకుండా హాస్పిటల్‌ బిల్లులు, ఇంటి పునరావాస వ్యయాలు, ఔషధాలు మొదలగు వాటికి వెచ్చించబడిరది. తీవ్రమైన అనారోగ్యాలు, స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫి (ఎస్‌ఎంఎ) వంటిఅరుదైన వ్యాధులు, వివిధ రకాలైన కేన్సర్లు, ట్యూమర్లు కలిగిన రోగుల కోసం ఈ ఫండ్‌ రైజర్‌ క్యాంపెయిన్లు ఇంపాక్ట్‌ గురు ద్వారా జనవరి 2021 నుంచి జులై 2022 దాకా నిర్వహించబడ్డాయి. వైద్య ఖర్చులు, ఆరోగ్యసంరక్షణ సేవలు పొందేందుకు డబ్బు లేని రోగులకు, వాటిని పొందడానికి మధ్యగల అంతరాన్ని తొలగించేందుకు ఆన్‌ లైన్‌ మెడికల్‌ క్రౌడ్‌ ఫండిరగ్‌ ప్రయత్నిస్తోందని ఇంపాక్ట్‌ గురు సహ వ్యవస్థాపకులు, సీఈఓ పీయూష్‌ జైన్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img