Friday, April 26, 2024
Friday, April 26, 2024

నూతన ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌ ప్రారంభం

బెంగళూరు: టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ (టీకెఎం) తమ నూతన ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. 2005లో ఇన్నోవాను పరిచయం చేసిన నాటి నుంచి ఈ వాహనం భారతీయ మార్కెట్‌లో ఇంటి పేరుగా మారిపోయింది. దీని సౌకర్యం, భద్రత, విశ్వసనీయత, విలాసం, శక్తిపరంగా ఇది ప్రశంసలను పొందింది. ఈ నూతన ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు వృద్ది చేసిన ఫ్రంట్‌ ఫాసియాతో వస్తుంది. దీనిని రగ్డ్‌, ధృడమైన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని తీర్చిదిద్దారు. తద్వారా భారతీయ కుటుంబాలు, వ్యాపారవేత్తలు, కార్పోరేట్స్‌, ఫ్లీట్‌ యజమానుల అవసరాలను తీర్చనుంది. నూతన ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ఇటీవల విడుదల చేయగా, అసాధారణ స్పందన అందుకున్న ఇన్నోవా హై క్రాస్‌ (గ్యాసోలిన్‌ మరియు స్ట్రాంగ్‌ హై బ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ట్రైన్స్‌లో లభ్యం)ను ఇది అనుసరిస్తుందని టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ సేల్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌ సూద్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img